సామాన్యుల ఆత్మీయునిగా నిస్వార్ధపు సేవ
ఆది నుండి అభాగ్యుల గొంతుగానే గుర్తింపు
స్థితి మారిన జనాన్ని వీడని జనోద్దారకుడు
కష్టమున్న ప్రతి గడపకు నేనున్నాననే భరోసా
కమ్యూనిజంతో ప్రారంభమై హ్యూమానిజంతో సాగుతున్న జీవన పయనం
చదువులమ్మ ఒడి నుండే సమస్యలతో పోరాటం
విధ్యార్ధి నాయకుడిగా విశేష ఉద్యమాలు
నాయకత్వ లక్షణాలు పునికిపుచ్చుకుని సామాన్యుల సమస్యలపై పోరాటాలు
3 దశాబ్దాల ప్రజా జీవీతంలో ఎన్నో ఆటుపోట్లు
స్వయంకృషితో వ్యాపార రంగంలో విజయాలు
జనంలో మార్పు ..మనలో మార్పు ఏది వచ్చినా తన దారి తాను చూసుకునే ఆధునిక సమాజంలో నిజమైన ప్రజా నాయకుడి లక్షణాలను కళ్లముందే సాక్షాత్కారించేలా జనమే మనం…మనమే జనం అనే నానుడిని ఈ కాలంలోనూ తన భుజస్కందాలపై మోస్తూ సామాజిక సేవలో తనదైన ముద్ర వేస్తూ యువతరానికి అభినవ ఆశోకుడిగా ఆదర్శంగా నిలుస్తున్నారు మేరుగు అశోక్.
బాల్యం..విద్యాబ్యాసం
సామాన్య చేనేత కుటుంబంలో జన్మించిన మేరుగు ఆశోక్కు బాల్యం నుండే తాను, తన కుటుంబం ఎదుర్కోంటున్న కష్టాలను కళ్ల ముందే చూస్తూ బాల్యాన్ని గడిపారు. తన జీవితాలు ఎలా ఉన్నా బిడ్డల బాగు ఎన్నో కష్ట నస్టాలకోర్చి విద్యాబుద్ధులు నెర్పిస్తున్న క్రమంలో ఆశోక్ను విధ్యార్ధి ఉద్యమాలు కదిలించాయ్. సమాజంలో సామాన్యులు ఏ రంగంలో ఉన్నా న్యాయం జరగాలన్న తపనతోనే ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఎంచుకున్న మార్గంలో తనకున్న ప్రతిభతో విజయవంతంగా అనతికాలంలోనే ఎస్ఎఫ్ఐలో మంచి గుర్తింపు తెచ్చుకుని నాయకుడిగా పేరు తెచ్చుకుని విధ్యార్ధుల సమస్యలపై తన గళమెత్తారు. తనతో పాటు విద్యార్ధులకు సమస్యల పరిష్కారానికి పోరాట ఆవశ్యకతను వివరిస్తూ సంఘంలో ఫుల్ టైం వర్కర్గా మారి పలు పోరాటాలను తన ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించి సంఘ పెద్దల మన్ననలు పొందాడు.
విద్యార్ధి ఉద్యమం
స్థానమేదైన తన స్థ్వార్ధం చూసుకునే కాలంలోనూ తన నిస్వార్ధ సేవను ప్రదర్శిస్తూ విధ్యార్ధి లోకంలోనే గాక అటు సంఘంలో గుర్తింపు తేచ్చుకునే క్రమంలో సీపీఎం పార్టీకి , ప్రజా ఉద్యమాలకు మరింత ఆకర్షితుడయ్యాడు. ఉద్యమాల నిర్మాణం, ప్రజా సమస్యల పట్ల తనకున్న తాపత్రయాన్ని , నాయకత్వ లక్షణాలను గుర్తించి ఎస్ఎఫ్ఐ నుండి సీపీఎం పార్టీలోకి తీసుకున్నారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా అను నిత్యం ప్రజల శ్రేయస్సే ప్రథమ కర్తవ్యంగా భావించి ప్రజా జీవితాన్ని వినుత్న రీతిలో ముందు సాగి అనతికాలంలోనే ప్రజా నాయకుడిగా మారి పార్టీలో, సమాజంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
విద్యార్ధి నాయకుడిగా సమాజంతో మమైకమైన జీవన పయనం నేటికి 3 దశాబ్దాలుగా కావస్తున్నా సమస్యలు ఎప్పటికప్పుడు ఏదో రూపంలో చుట్టు ముట్టినా వేసిన అడుగు , ఇచ్చిన మాటకు వెనక్కి రాకుండా తన జీవీతం ప్రజలకే అంకితమనే భావనను నిలువునా నింపుకుని ప్రజా ఆశీర్వాదంతో మెరుగు అశోక్ ముందుకు సాగుతున్నారు. ఒడిదుడుకులను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ , సామాజిక, రాజకీయ కుట్రలను చేదిస్తూనే తన చుట్టూ , తనకు తెలిసి, తన దృష్టికి వచ్చిన సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నేనున్నానంటూ సామాన్యుల అన్నగా, బిడ్డగా అభాగ్యులకు అండగా నిలుస్తూ అవసరమైన సహకారాన్ని అందిస్తూ తనలో మానవీయ కోణాన్ని ప్రదర్శిస్తూ నేటి యువతకు మేరుగు అశోక్ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సామాన్యుల కుటుంబ సభ్యుడిగా
కష్టం ఉన్న సామాన్యులకు సందర్భమేదైనా అండగా ఉంటూ వారికి అవసరాలను తీర్చడం , కష్టాల్లో అండగా నిలవడానికి ఏ నాడు వెనుకడుగు వేయకుండా తన చుట్టూ ఉన్న సేవ తత్పరతను చాటుతున్నారు మేరుగు అశోక్ .ప్రంపంచాన్నే వణికించిన కరోనా సమయంలోనూ ప్రాణాలను లెక్క చేయకుండా సహాయం కోసం ఎదరు చూసిన ప్రతి గడపకు వెళ్లి అవసరాలను తీర్చి వందల కుటుంబాల్లో కుటుంబ సభ్యుడిగా మారాడు. వరంగల్ నగరాన్ని వరదలు చుట్టూ ముట్టి ప్రజలు తల్లడిల్లిన సమయంలోనూ అధికారులు సైతం చేరుకోలేని ప్రాంతాలను సందర్శించి ప్రజలను పరామర్శించి వారికి అండగా నిలిచి నిజమైన నాయకుడిగా …సామాన్యుల ఆత్మ బంధువుగా మారి ప్రజలపై తనకున్న ప్రేమ…సమాజం పట్ల తనకున్న గురుతర బాధ్యతను అను నిత్యం గుర్తు చేసుకూంటూ సామాజిక స్ఫూర్తి ఫరిడవిల్లేలా తన వంతు కృషి చేస్తున్నారు.
