Thursday, October 15, 2026

Karnataka: బడ్జెట్‌లోపే తేల్చాలి.. సీఎం మార్పుపై కర్ణాటక మంత్రి

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన పరమేశ్వర గత నెలలో తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పారు. దళిత సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలని కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక వర్గం డిమాండ్‌ చేస్తోంది.

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర (G Parameshwara) మంగళవారంనాడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాయకత్వం అంశంపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా వచ్చే ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సన్నాహకాలకు ముందే ఆ పని చేయాలని అన్నారు. నాయకత్వాన్ని మార్చాలా వద్దా అనేది కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుందని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Related Articles

Most Popular