Thursday, October 15, 2026

Harish Rao: బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: హరీశ్‌రావు

హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (Telangana CM Revanth Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ ద్రోహి, జలదోపిడి ద్రోహి రేవంత్‌రెడ్డినే అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు హరీశ్‌రావు. ఏపీ నిర్మిస్తోన్న గోదావరి – బనకచర్ల ప్రాజెక్ట్‌కు సీడబ్య్లూసీ అనుమతి వచ్చిందని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం లేకుండా సీడబ్య్లూసీ ఎలా అనుమతి ఇస్తోందని ప్రశ్నల వర్షం కురిపించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని ఆక్షేపించారు హరీశ్‌రావు.

Related Articles

Most Popular