Thursday, October 15, 2026

T20 WC 2026: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఐపీఎల్ రూ.13కోట్ల స్టార్‌కు దక్కని చోటు

టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి ఇంగ్లండ్ జట్టును తాజాగా ప్రకటించారు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇంటర్నెట్ డెస్క్: అత్యంత త్వరలోనే టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్పటికే టీమిండియా తమ జట్టును ప్రకటించింది. కాగా తాజాగా ఇంగ్లండ్ 15 మందితో కూడిన ప్రొవిజనల్ జట్టును ప్రకటించింది. అయితే ఈ టీమ్‌లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌(Liam Livingstone)కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. వికెట్‌కీపర్, బ్యాటర్ జేమీ స్మిత్‌కు కూడా ఇంగ్లిష్ జట్టు సెలక్టర్లు మొండిచేయి చూపారు.

Related Articles

Most Popular