Thursday, October 15, 2026

BRS: అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ప్రకటించిన కేసీఆర్

హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) బీఆర్ఎస్ పార్టీ (BRS) అధికార నాయకత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గులాబీ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ముఖ్య నాయకులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్, ఉప నేతలు, విప్‌లుగా ప్రకటించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్‌గా హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను ప్రకటించారు. వీరు అసెంబ్లీలో పార్టీ ప్రతినిధుల సహకారం, సభలో పార్టీ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ మేరకు కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Related Articles

Most Popular