గమనం న్యూస్:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ విభాగం అధ్యక్షునిగా మరోసారి మహమ్మద్ జమాల్ నియామకం.మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మహమ్మద్ జమాల్ నీ నియమించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.వరుసగా మూడవసారి జమాల్ వైపు మొగ్గు చూపిన వైనం.ఈ సందర్భంగా పాత్రికేయ సమావేశంలో జమాల్ మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు పని చేసి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పనిచేస్తానని తెలిపారు.ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని తెలియజేశారు.తమ నియామకానికి సహకరించిన పిసిసి ఎస్సీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్,మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపెళ్లి సత్యనారాయణ,స్టేట్ మైనారిటీ చైర్మన్ ఇర్ఫాన్ అలీ,వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్,రాజన్న సిరిసిల్ల జిల్లా మైనారిటీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్,కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి,మానకొండూర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుల వెంకటి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియడం జరిగింది.
