గమనం, వరంగల్ జిల్లా (శివనగర్) : విజయదశమి దసరా ఉత్సవమును మంగళవారం రోజున శమీ పూజ, ఆయుధ పూజ మరియు కూష్మాండబలి పూజను మంగళవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ రామాలయం నుండి కమిటీ అధ్యక్షులు సుంచుమాధవ్ జమ్మి తో మరియు ప్రధాన కార్యదర్శి దామరగిద్ద ప్రభాకర్ కూష్మాండంతో కోశాధికారి మేరుగు అశోక్ ఖడ్గం దారనతో మంగళ వాయిద్యాలతో, శివానగర్ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆనందోత్సవాలతో అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకొని వచ్చి శ్రీ రమా రహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మేరుగుఅశోక్ కూస్మాండబలి చేయగా శమీ పూజను *సుంచు మాధవ్ చేసి దసరా ఉత్సవాన్ని నిర్వహించడం జరిగినది,ఈ ఉత్సవంలో ఉపాధ్యక్షులు బైరి శ్యామ్ , సుంచు కేశవ్, సహాయ కార్యదర్శులు రాసకచ్చుల రమేష్, దండు సమ్మయ్య కార్యదర్శి గూడూరు మధుసూదన్ కార్యవర్గ సభ్యులు సుంచు భాగ్యమ్మ,బైరి బుచ్చమ్మ,బండారు జ్యోతి,బైరి ప్రభాకర్,నాంచార్ల బ్రహ్మచారి, సదనం శ్యామ్, దుండే జోగేందర్, మరియు శ్రీ సత్య గణపతి ఉత్సవ యూత్ కమిటీ, మహిళా యూత్ కమిటీ,35వ డివిజన్ పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి, బిల్ల రాజు, దండు అరుణ, దామెరగిద్ద హేమావతి, మార్త ఉష,గోగుల ఇందిరా, కోతి స్వరూప, వార్డులోని ప్రముఖులు మరియు మహిళలు పాల్గొన్నారు
