గమనం, హనుమకొండ జిల్లా (ఐనవోలు): కొండడపర్తి గ్రామంలో బతుకమ్మ ఉత్సవాలను పీహెచ్సీ ఆవరణలో అధికారులు సిబ్బంది అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలోని మహిళ అధికారులు, సిబ్బంది పాల్గొని రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు, మహిళల కోలాహలం మధ్య పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పీహెచ్సీ సెంటర్ ఆవరణలో ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం విశేషం. ఈ వేడుకల్లో పీహెచ్ సీ వైద్యాధికారులు డాక్టర్ శ్యాం ప్రసాద్, రమాదేవీ, సీహెచ్వో మధుసూధన్ రెడ్డి, హెచ్ఐవో రాజేశ్వర్ రెడ్డి ,కేవీహెచ్ సత్యవేద, ఆయూష్ డిపార్ట్మెంట్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ అలావత్ కోక్యా, జాన్సన్ , ఆశా వర్కర్ల అధ్యక్షురాలు సింగారపు ఉమాదేవి, ఉపాధ్యక్షురాలు కట్కూరి శ్యామల, కార్యదర్శి రంగు రమ, లావణ్య, కట్కూరి కోమల, సూత్రవు కమల, సంధ్యారాణి, రమాదేవీ, ఎండీ బిపాషా, నజీమా,రమ ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
