మీ కుటుంబమంతా గాంధీల కాళ్ళు మొక్కింది మరిచావా…?
నీ నోటి దూలకు కళ్లెం వేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు చాలు
రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టడంతో నీకు సుఖలెక్కువైనయి
రాష్ట్రంలో ప్రజలు వరుస ఎన్నికల్లో బుద్ధి చెప్తున్నా ఇంకా సిగ్గులేని వ్యాఖ్యలెందుకు…?
అధికారం కోల్పోయి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడితే తగిన గుణపాఠం తప్పదు
క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ, ప్రజా నాయకుడు సీఎం,రేవంత్ రెడ్డి జోలికొస్తే ఖబడ్దార్
కేటీఆర్ వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమాల్లో భారీగా పాల్గొనండి
వర్ధన్నపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ & మండల ఉపాధ్యక్షుడు కుల్ల యకాంతం
వర్ధన్నపేట : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై యువజన కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుల్ల యకాంతం మండిపడ్డారు. సభ్యత లేకుండా మాట్లాడటం సరికాదని విమర్శించారు . గురువారం యకాంతం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. జనగామ బీఆర్ఎస్ సభలో కేటీఆర్.. రాహుల్‌గాంధీని ‘హౌలాగాడు’ అని సంబోధించడం సరికాదని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ కుటుంబం కాళ్లు పట్టుకున్న నీవు.. హౌలా.. అంటూ మాట్లాడుతావా? అని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ ఐపీఎస్ అధికారిని బూతులు తిట్టారని, వాళ్ల బతుకులు అంతేనంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు సిగ్గు, శరం లేదని, ఆయనను బ్రోకర్, లఫూట్ గాడని తిట్టలేమా? అని అన్నారు. రాహుల్‌గాంధీకి క్షమాపణలు చెప్పే వరకు కేటీఆర్‌ను వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని విమర్శించే తీరు చూస్తే కేటీఆర్‌లో అసహనం పరాకాష్టకు చేరిందని యకాంతం అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి.. కానీ ఈ విధమైన భాష మంచిది కాదని హితవు పలికారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని ఒక ప్రకటనలో కొనియాడారు. రాహుల్ గాంధీని ఇలాగే విమర్శించిన పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. రాహుల్‌గాంధీని విమర్శించే నైతిక అర్హత కేటీఆర్‌కు లేదని అన్నారు. సభ్యత లేకుండా మాట్లాడిన కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రేటర్ హైదరాబాద్, రాష్ట్రంలో కేటీఆర్‌ను ఎక్కడ తిరగనివ్వబోమని, బట్టలు ఊడదీసి తమ కార్యకర్తలు కొడతారని హెచ్చరించారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పటికీ కేటీఆర్‌కు అహంకారం, నోటి దురుసు తగ్గలేదన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎదుట మాట్లాడేందుకు ధైర్యం లేని కేటీఆర్.. రోడ్ల వెంట తిరుగుతున్నారని విమర్శించారు.మాట్లాడే విషయంలో కేటీఆర్ అదుపు తప్పుతున్నారని, స్థాయి, హద్దులు దాటి మాట్లాడటం సరికాదని విమర్శించారు. రాహుల్ గాంధీకి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ మానసిక స్థితిపై ఆయన భార్య శైలిమ జాగ్రత్తగా గమనించాలని ఆయన సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి గురించి మరో మారు పనికిరాని వ్యాఖ్యలు చేస్తే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందుకు సిద్ధంగా ఉండాలని యకాంతం సూచించారు. అలాగే కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ అర్బన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ ఆదేశాలను అనుసరిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొని యువజన కాంగ్రెస్ సత్తా చాటాలని కుల్ల యాకాంతం పిలుపునిచ్చారు.
