Friday, October 16, 2026

ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు షూస్, టై, బెల్ట్, టీ షర్ట్స్ పంపిణి

రాయపర్తి(వరంగల్ జిల్లా)గమనం:

మండలంలోని పెరికేడు మరియు జగన్నాథపల్లి గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు షూస్.టై. స్పోర్ట్స్ టీషర్ట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పూలతో పరుపాటి శ్రీనివాస్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు గుగులోత్ జాజు నాయక్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, గారే నర్సయ్య, ఐత రామ్ చందర్, గజావెల్లి ప్రసాద్, ఎండీ యూసఫ్, మాలోత్ వసుంధర్, సంకినేని ఎల్లస్వామి, చందు సతీష్, చిలువేరు సాయి గౌడ్, ఐత రవి, ల్యాదేళ్ల ప్రశాంత్, గారే నరేష్ , స్థానిక నాయకులు అయిన గ్రామ పార్టీ అధ్యక్షులు బొమ్మేర వీరాస్వామి, మాజీ సర్పంచ్ చిన్నల రాజబాబు, మాజీ ఎంపీటీసీ బండి రాజబాబు, పార్టీ ముఖ్య నాయకులు ఆకుల సమ్మయ్య, మంగిశెట్టి రాజు, ఎండీ అంజాద్, మధు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Most Popular