Friday, October 16, 2026

తెలంగాణ జాగృతి రాష్ట్ర బీసీ అధ్యయన కమిటీ సభ్యుడిగా మల్లేష్ తడిగొప్పుల 

గమనం,నర్సంపేట:

తెలంగాణ జాగృతి నూతన ప్రాంతీయ రాజకీయ పార్టీగా రూపుదిక్కునే దిశగా అడుగులు వేస్తోంది పార్టీ ఏర్పాటు నేపధ్యంలో ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసేందుకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సుమారు 30 అంశాలకు కూడిన అధ్యయన కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా బీసీల సమస్యలు, రాజకీయాల్లో వారి వాటా భవిష్యత్ రాజకీయాల్లో వారి యొక్క పాత్ర అనే వివిధ అంశాల పైన సమగ్రంగా అధ్యయనం చేయడం కొరకై ఆరుగురు సభ్యులతో కూడిన బీసీ అధ్యయన కమిటీలో తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నా పట్ల నమ్మకం ఉంచి కమిటీలో సభ్యుడిగా చేర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము మధ్యాహ్నం చేసేటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో చేర్చే విధంగా ఉండాలని సుబ్బండ వర్గాల ఆమోదం పొందే విధంగా లోతుగా అధ్యయనం చేయాలని సూచనలు చేయడం జరిగింది. వారు నాపై పెట్టినటువంటి బాధ్యతను నా శాయశక్తుల నిర్విరామంగా, నిష్కల్మషంగా,నిక్కచ్చిగా అందజేస్తానని మనస్పూర్తిగా తెలియజేస్తున్నాను.

Related Articles

Most Popular